బీఆర్ఎస్ కు మద్ధతుగా కాంగ్రెస్ మాజీ ఎంపీ

 బీఆర్ఎస్ కు మద్ధతుగా కాంగ్రెస్ మాజీ ఎంపీ

తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి మద్ధతుగా నిలిచారు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ..మహిళ నాయకురాలు.. అసలు వివరాల్లోకి వస్తే కేంద్రమంత్రి ..సికింద్రాబాద్ బీజేపీ ఎంపీగా బరిలోకి దిగిన కిషన్ రెడ్డి మాట్లాడుతూతెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదంటూ  ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ..మాజీ ఎంపీ విజయశాంతి ఆసక్తికరంగా స్పందించారు.

కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అభిప్రాయం సమంజసం కాదని విజయశాంతి అన్నారు. ఆత్మగౌరవం, పోరాటతత్వం దక్షిణాది రాష్ట్రాల సహజ లక్షణమని ఆమె వ్యాఖ్యానించారు. దక్షిణాది స్వీయ గౌరవ అస్థిత్వ సత్యాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు బీజేపీ అర్థం చేసుకోలేక పోయిందని రాములమ్మ విమర్శించారు.ఆమె ట్వీట్ సారాంశం తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అభిప్రాయం సమంజసం కాదు.

ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం. ఎప్పటికీ ఇది అర్ధం చేసుకోకుండా వ్యవహరించే వారికి.. దక్షిణాది… దశాబ్ధాలుగా కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలిత నుంచి ఇప్పటి బీఆర్ఎస్, వైసీపీ దాకా ఇస్తున్న రాజకీయ సమాధానం విశ్లేషించుకోవాల్సిన తప్పని అవసరం… ఎన్నడైనా.. వాస్తవం…ఈ దక్షిణాది స్వీయ గౌరవ అస్థిత్వ సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు, బీజేపీ కనీసం ఆలోచన చెయ్యని అంశం బహుశా కిషన్ రెడ్డి ప్రకటన భావం’’ అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *