అధికార పక్షంపై BRS పోరు- ఎడిటోరియల్ కాలమ్
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ 64,బీఆర్ఎస్ పార్టీ 39 ఎమ్మెల్యే స్థానాలను గెలుపొందింది. మరోవైపు ఎంఐఎం ఏడు.. బీజేపీ ఎనిమిది స్థానాల్లో.. సీపీఐ ఒక స్థానంలో విజయడంకా మ్రోగించింది. ఎన్నికల ప్రచార సమయంలో అప్పటి పీసీసీ చీఫ్ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి & టీమ్ చెప్పిన ఇచ్చిన హామీలు ప్రతి మహిళకు నెలకు రెండున్నర వేలు.. ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ (200యూనిట్ల వరకు).. ప్రతి ఆడబిడ్డ పెండ్లికి కళ్యాణ లక్ష్మీతో పాటు తులం బంగారం.. అర్హులైన ప్రతోక్కర్కి ఆసరా కింద నాలుగు వేలు.. డిసెంబర్ తొమ్మిది తారీఖున రెండు లక్షల రుణమాఫీ… రైతుభరోసా కింద రైతులకు పదిహేను వేలు.. రైతుకూలీలకు పన్నెండు వేలు.. తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే వీటితో పాటు జాబ్ క్యాలెండర్ కు చట్టభద్రత కల్పిస్తామని ఎన్నికల ప్రచారం ముగిసే చివరి క్షణం వరకు ఊదరగొట్టిన అంశాలివి.
మరోవైపు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఆసరా పించన్ పెంచుతామన్న.. రుణమాఫీ చేస్తామని హామీచ్చిన కానీ పదేండ్ల సంక్షేమాభివృద్ధిని పక్కకు పెట్టి మరి మార్పు మార్పు అని చెప్పిన కాంగ్రెస్ వైపు తెలంగాణ సమాజం చూసింది.. చూసినట్లుగానే ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఎన్నికల ఫలితాల హోరు మాములుగా జరగలేదు.. కేవలం 1.85% కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టగా.. బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది.. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం వెనక ఉన్న కారణాలు..లోపాల గురించి ఆ పార్టీ శ్రేణులు విశ్లేషణలు చర్చోపచర్చలు చేస్కున్నారు.. అది వేరే విషయం.. అయితే ఇక్కడ ప్రజలు అధికారాన్ని తప్పించి ప్రతిపక్ష హోదా కట్టబెట్టిన బీఆర్ఎస్ ఆ హోదాలో గత ఏడు ఎనిమిది నెలలుగా విజయవంతమైందా..?. విఫలమైందా..?.ప్రతిపక్ష పాత్ర ఎలా నిర్వహించింది..?. ఏమి ఏమి లోపాలు ఉన్నాయో ..? .. ఇప్పుడు తెలుస్కుందాము..
ఎన్నికల ఫలితాల రాత్రే మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు చిన్నపాటి గాయం కావడం.. విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించడంతో ఇటు అసెంబ్లీ బయట అటు అసెంబ్లీ లోపల మాజీ మంత్రులు కేటీ రామారావు,తన్నీరు హారీష్ రావు ప్రతిపక్ష నేతలుగా తమ మార్కును చూపించారు. అసెంబ్లీలో అధికార పక్షాన్ని ముప్పై తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపించారు.. అదే సమయంలో తామైమైన తక్కువ తిన్నామా అన్నట్లు అధికార పక్షం కూడా అదే స్థాయిలో ప్రతిపక్ష పార్టీ విమర్శలను ఆరోపణలను తిప్పికొట్టిందని రాజకీయ విశ్లేషకుల.. మీడియాలో కథనాలు తెగ వైరల్ అయ్యాయి.
అయితే ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణుల పోరాటాన్ని ఆన్ లైన్ .. ఆఫ్ లైన్ గా విభజిస్తే మాజీ మంత్రులు కేటీఆర్,హారీష్ రావు,జగదీష్ రెడ్డి,ప్రశాంత్ రెడ్డి,ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి,పాడి కౌశిక్ రెడ్డి,వివేకానంద్ గౌడ్ తదితరులు పదేండ్లలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేశామో చెప్పడమే కాకుండా అధికార పక్షం చేస్తున్న తప్పులను అదే స్థాయిలో ప్రజలకు ఆర్ధమయ్యే విధంగా విమర్శించి చెప్పడంలో విజయవంతమయ్యారు అని చెప్పోచ్చు. ఇది మీడియాలో అది సోషల్ మీడియా కావోచ్చు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ కావోచ్చు యూట్యూబ్ కావోచ్చు వేదిక ఏదైన కానీ అన్నింటిలోనూ ప్రచారం బాగానే జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిందేమిటంటే ప్రస్తుతం సామాన్యుల దగ్గర సెలబ్రేటీల వరకు తమకున్న బిజీబిజీ షెడ్యూల్ కారణంగా టీవీల్లో లైవ్ కావోచ్చు.. పత్రికల్లో కావోచ్చు చూసేంత టైం వాళ్లకు ఉండకపోవచ్చు..
ఎవరి అంచనాలు ఏమైన కానీ నిజానికి అయితే అందరూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కంటే సోషల్ మీడియా,యూట్యూబ్ లనే ఎక్కువగా చూస్తున్నారు ఈరోజుల్లో.. ఈ అన్ని ప్లాట్ ఫాంలలో అది ప్రసారమైంది ..కానీ మీడియాలో ప్రచారమైన కానీ అది క్షేత్రస్థాయిలోకి వెళ్లలేదనేది ఇక్కడ టాక్. ఎందుకంటే ఎన్నికల ఫలితాలు విడుదలైన తెల్లారు నుండే మాజీ మంత్రులు కేటీఆర్,హారీష్ రావు నుండి ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీల వరకు అందరూ ఎత్తుకున్న రాగం “రుణమాఫీ”. డిసెంబర్ తొమ్మిదో తారీఖున రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మాట తప్పాడు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాములుగా విమర్శల పర్వంతో ఉక్కిరిబిక్కిరి చేయలేదు..
ఆ తర్వాత నిరుద్యోగ యువత గురించి… ఆ తర్వాత ఆసరా గురించి.. ఆ తర్వాత గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు… ఆ తర్వాత హైదరాబాద్ లో కుక్కల బెడద గురించి తాజాగా గురుకులాల్లో జరుగుతున్న ఫుడ్ ఫాయిజన్ గురించి బీఆర్ఎస్ శ్రేణులు ఎంచుకున్న మార్గాన్ని.. ఎత్తుకున్న రాగాన్ని ఎవరూ తప్పుపట్టరు ఇక్కడ.. కానీ అది పోరాటాలు జరగాల్సింది మీడియాలోనో… సోషల్ మీడియాలోనూ.. హైదరాబాద్ కేంద్రంగానో.. నియోజకవర్గాల లేదా జిల్లాల కేంద్రంగానో కాదు.. పల్లె పల్లెన గ్రామగ్రామాన జరగాలి.. అది హైలెట్ కావాలి.. బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న పోరాటాలు ఉద్యమాలు.. మీడియాలో అటెన్షన్ అవుతున్నాయి . కానీ పీపుల్స్ అటెన్షన్ ను మాత్రం దక్కించుకోలేకపోతున్నాయి..
ఎక్కడ లోపం ఉందో చర్చించుకోకుండా.. తెలుసుకోకుండా ఇదే పంథాను కొనసాగిస్తే మాత్రం ఇంత పోరాటం. ఉద్యమాలు చేసిన కానీ బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది తప్పా ఎలాంటి ఫలితం ఉండదు.ఎందుకంటే ప్రజలకు బీఆర్ఎస్ మంచిగా చేసిందా.. ? కాంగ్రెస్ మంచిగా చేసిందా అనే ఆలోచన రానంతవరకు ఎన్ని పోరాటాలు .. ఉద్యమాలు చేసిన అవి మీడియా అటెన్షన్ తప్పా పీపుల్స్ అటెన్షన్ కాదు. . మాములుగా ఎవరికైన నొప్పి తెలిసి రావాలి అప్పుడు మనం భుజం అందిస్తే బోరున ఏడ్చే వారిని ఓదార్చినట్టు చేయాలే తప్పా అందుకే అంటారు వాత పడ్డాక మలాం రాస్తేనే మన విలువ తెలిసేది .కావున ఇకనైన కానీ మీడియా అటెన్షన్ ఒక్కటే కాకుండా పీపుల్స్ అటెన్షన్ ను కూడా పట్టించుకుని ముందుకెళ్తే బాగుంటదని విశ్లేషకుల భావన.