ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..?
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ చేసిన పోరాటం ఎట్టలకే ఫలించింది. విద్యుత్ ఛార్జీలు పెంచకూడదు.. సామాన్యులపై భారం మోపకూడదని చేసిన పోరాటానికి ఇటు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి దిగోచ్చినట్లు కన్పిస్తుంది.
ఇటీవల మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈఆర్సీని కల్సి కరెంటు ఛార్జీలను పెంచోద్దని విన్నవించింది. ఆ తర్వాత సిరిసిల్లలో జరిగిన బహిరంగ విచారణలో సైతం కేటీఆర్ పాల్గోని ప్రజల తరపున తమ గళాన్ని విన్నవించారు.
కరెంటు ఛార్జీలు పెంచాలని డిస్కంలు ప్రతిపాదించిన నివేదికను ఈఆర్సీ తిరస్కరించింది. ఏ కేటగిరిలోనూ కరెంటు చార్జీలను పెంచడానికి అనుమతి లేదని తేల్చి చెప్పింది. అయితే ఎనిమిది వందల యూనిట్లు దాటితే ఫిక్స్ డ్ చార్జీలను పది నుండి యాబై రూపాయల వరకు పెంచుకునే వెసులుబాటు ఇవ్వాలని డిస్కంలు చేసిన ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించింది.