BRS MLA కాళ్లు మొక్కిన రేవంత్ రెడ్డి

brs mla arrest
అదేంటి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళ్లు మొక్కడం ఏంటని ఆలోచిస్తున్నారా..? . మొక్కితే గిక్కితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాళ్ళో.. లేదా తన పూర్వ పార్టీ టీడీపీకి చెందిన ఎమ్మెల్యే కాళ్లు మొక్కాలి కానీ ఇలా తాను సీఎం కాకముందు నుండి తనను అన్ని విధాలుగా టార్గెట్ చేసిన బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే కాళ్లు మొక్కుతారా అని మీకు డౌటానుమానం రావోచ్చు. ఇది నిజమే అని అంటున్నారు హుజుర్ బాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.
తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నన్ను చంపించాలని ప్రయత్నిస్తున్నాడు. నాపై ఎమ్మెల్యే అరికెలపూడి గాంధీ మరియు కాంగ్రెస్ కు చెందిన గుండాలతో హత్యయత్నం చేయించానని ఆయనే చెబుతున్నారు. నాకు ఏమి జరిగిన దానికి బాధ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే. దీనిపై గవర్నర్ ను కలుస్తాను.. పిర్యాదు చేస్తాను అని అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ ” రేవంత్ రెడ్డి మరిచిపోయిండేమో. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు టీపీసీసీ పోస్టు కు నా మద్ధతుగా కోసం నా ఇంటికి వచ్చాడు. వచ్చి టీపీసీసీ పోస్టు కోసం నాకు మద్ధతు ఇవ్వాలని ఏకంగా నాకాళ్లు మొక్కిండు. ఈ విషయం రేవంత్ రెడ్డి మరిచిపోయారేమో .. రేవంత్ నీతో నేను కాంప్రమైజ్ కాను.. నిన్ను ముఖ్యమంత్రి కుర్చి నుండి దీంచేవరకు నిద్రపోకుండా పని చేస్తాను.. కేసీఆర్ కేటీఆర్ హారీష్ రావును అనే స్థాయి నీది కాదు .. నువ్వు రౌడీ స్థాయికి దిగజారావు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
