బీఆర్ఎస్ కు ఆ అర్హత లేదు
ప్రోటోకాల్ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి మల్కాజిగిరి లో ఎంత విలువ ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్న హరీష్ రావు, కేటీఆర్ లకు అప్పటి ముఖ్యమంత్రులు చాలా గౌరవమిచ్చారు. నేను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రోటోకాల్ బాధితుడిని అని అన్నారు.
పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే అర్హత కూడా హరీష్ కేటీఆర్ లకు లేదు.. ఏ రాజ్యాంగం చెప్పింది అని పడేండ్లలో అరవై మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకుందో సమాధానం చెప్పాలి. ఎమ్మెల్యేలు పార్టీ మారడం సర్వసాధారణం.. ఇటు నుండి అటు వెళ్తారు.అటు నుండి ఇటు వెళ్తారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.