ఎమ్మెల్సీ కవిత పై బీఆర్ఎస్ వేటు.

BRS MLC KAVITHA
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత పై ఆ పార్టీ వేటు వేసింది. గత కొంతకాలంగా ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, జగదీశ్ రెడ్డి , మాజీ తాజా ఎమ్మెల్యేల గురించి పలు వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.
తాజాగా అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఎమ్మెల్సీ కవిత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు, మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ లపై పలు వివాదస్పద వ్యాఖ్యలతో పాటు సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీంతో ఎమ్మెల్సీ కవిత పార్టీ క్రమశిక్షణ నియమనిబంధనలను ఉల్లంఘించారనే నెపంతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మీడియాకు లేఖను విడుదల చేశారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వెల్లడించింది.