చట్టాలు ప్రతిపక్ష పార్టీకేనా.?.అధికార పార్టీకి వర్తించవా..?

 చట్టాలు ప్రతిపక్ష పార్టీకేనా.?.అధికార పార్టీకి వర్తించవా..?

BRS VS CONGRESS

తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కాబోతుంది. ఈ ఏడాదిలో అధికార కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వాన్నో.. ముఖ్యమంత్రినో.. మంత్రులనో ప్రశ్నిస్తున్నారనో.. దూషిస్తున్నారనో కేసులు పెట్టి మరి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన నేతలను.. సానుభూతి పరులను… జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టాన్ని అతిక్రమించి ఎవరూ ప్రవర్తించిన కేసులు పెట్టి అరెస్ట్ చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానులే..చట్టం ఎవరికి చుట్టం కాదు. కానీ తెలంగాణలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి దగ్గర నుండి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి,పొన్నం ప్రభాకర్ గౌడ్,ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు తమదైన శైలీలో ప్రతిపక్ష బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గర నుండి ఆ పార్టీకి చెందిన నేతలపై అసభ్య పదజాలంతో కాకపోయిన కానీ అధికారంలో ఉన్నప్పుడు అనరాని మాటలను అంటున్నారు.

నిన్న కాకమొన్న మూసీ నది ప్రక్షాళన పాదయాత్ర ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూసీ నది ప్రక్షాళనకు అడ్డుపడితే కేసీఆర్ నువ్వు కుక్క చావు చస్తావ్ అని విమర్శించారు. మాజీ మంత్రులను హారీష్ రావు,కేటీఆర్ లతో పాటు బీఆర్ఎస్ నేతలను బుల్డోజర్లతో తొక్కిస్తాను అని వార్నింగ్ ఇచ్చారు. మరో మంత్రి కోమటీరెడ్డి వెంకటరెడ్డి మరో అడుగు ముందుకెసి కేసీఆర్ ను ముక్కముక్కలుగా చేస్తారు అని హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యానించారు అని ఏకంగా మాజీ మంత్రి హారీష్ రావు ప్రెస్మీట్ లో నిప్పులు చెరిగారు. ప్రజాసామ్య వ్యవస్థలో రాజ్యాంగం కల్పించిన హక్కులల్లో ఒకటి స్వేచ్చ హక్కు.. మాట్లాడే హక్కు.. ఈ రెండింటీని వినియోగించుకుని ఎవరైన సరే చట్టాన్ని అతిక్రమించకుండా.. రాజ్యాంగ ఉల్లంఘన జరగకుండా మాట్లాడోచ్చు.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేయచ్చు.

కానీ ఒక్క ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన నేతలు మాత్రమే చట్టాన్ని అతిక్రమిస్తున్నారు.. రాజ్యాంగాన్ని ఉల్లంగిస్తున్నారు అనే రేంజ్ లో ఊహించుకుని వారినే సైడ్ కార్నర్ చేస్తున్నారు. తమ పార్టీకి చెందిన నేతలు మాట్లాడేది సుభాషితాలు.. బీఆర్ఎస్ శ్రేణులు.. వారి అనుకూలవర్గం వారు మాట్లాడేది బూతులు అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. ఇలా వ్యవహరించడం ఎవరికి అంత మంచిది కాదు. అధికార పార్టీ అయిన ప్రతిపక్ష పార్టీ అయిన సరే ఒక మాట మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించాలి.. ఆరోజు ట్రెండింగ్ కోసం ఏదో మాట్లాడాలి.. మీడియాలో వార్తల కోసమో మాట్లాడితే ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ రేపు ప్రతిపక్షంలో ఉంటుంది.. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ రేపు అధికారంలో ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏపీలో ప్రస్తుతం టీడీపీ వైసీపీలను ఊదాహరణగా తీసుకుంటే పైన పెట్టిన టైటిల్ కు ఆర్ధం తెలుస్తుంది. అందుకే ఎవరైన సరే చట్టాన్ని రాజ్యాంగాన్ని అనుసరించి వ్యవహరించాలి.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *