సభలో రేవంత్ రెడ్డి సెటైర్లు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణపట్ల కేంద్ర వైఖరికి నిరసనగా చేపట్టిన తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిమ్స్ లో సకల సౌలతులతో దీక్షలు చేయలేదు..
చావు నోటిలో తలపెట్టి తెలంగాణను తెచ్చాను అని చెప్పుకోలేదు.. వందరూపాయలను పెట్టి పెట్రోల్ కొనుక్కోలేదు.. అర్ధరూపాయి పెట్టి అగ్గిపెట్టె కొనలేకపోయాము.. యాదయ్య లాంటి తెలంగాణ బిడ్డల చావుకు కారణం కాలేదు అని వ్యంగ్యంగా అన్నారు.
ఢిల్లీలో దీక్షకు నేను సిద్ధం.. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ను తీసుకురండి.. చచ్చుడో.. కేంద్రం మెడలు వంచుడో తేలుతుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.