చరిత్ర పునరావృతమవుతుంది
తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చేరడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్..మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు ఎక్స్ వేదికగా స్పందించారు..
ప్రస్తుతం అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్రజల శక్తి ఎప్పుడూ బలంగానే ఉంటుందని ఆయన పేర్కోన్నారు… ‘నాడు ఉమ్మడి రాష్ట్రంలో 2004-06లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేకసార్లు ఎమ్మెల్యేల ఫిరాయింపులను ఎదుర్కొన్నాము.
ఆ తర్వాత తెలంగాణ ప్రజలు దీటుగా స్పందించారు. చివరికి కాంగ్రెస్ తల వంచాల్సి వచ్చింది. మరోసారి చరిత్ర పునరావృతమవుతుంది’ అని కేటీ రామారావు పేర్కొన్నారు.