మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం
ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి 164స్థానాల్లో,వైసీపీ 11స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే.
ఐదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చాక టీడీపీ శ్రేణులు వైసీపీ నేతలు,కార్యకర్తలపై దాడులకు దిగుతుండటంతో మాజీ సీఎం ..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఇందులో భాగంగా వైసీపీకి చెందిన పార్టీ శ్రేణులు, సోషల్ మీడియా సైనికులకు అండగా ఉండేలా ప్రతి పార్లమెంట్ పరిధిలో కమిటీలు వేయాలని వైసీపీ అధినేత జగన్ ఆదేశించారు.
అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే ఈ కమిటీలు కార్యకర్తలకు అండగా ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కమిటీ సభ్యులుగా జిల్లా పార్టీ అధ్యక్షులు, పోటీ చేసిన అభ్యర్థులు ఉండనున్నారు.