రాజీనామా సవాళ్ల వల్ల ఎవరికి లాభం..-ఎడిటోరియల్ కాలమ్

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాజీనామా సవాళ్ల రాజకీయం నడుస్తుంది. ఈరోజు సోమవారం కొడంగల్ లో పర్యటించిన మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఉప ఎన్నికలకెళ్లి గెలువు.. కొడంగల్ నుండి నీ పతనం ప్రారంభమైంది అని సవాల్ విసిరారు.
దీనికి కౌంటర్ గా పరిగి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ” కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి అవసరం లేదు. దమ్ముంటే నువ్వు సిరిసిల్ల లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్దాం.. దమ్ముంటే కొడంగల్ లో ఎంపీపీ.. జెడ్పీపీ గెలిచి చూపించండి. కేసీఆర్.. హారీష్ రావు.. నువ్వున్న మెదక్ .. కరీంనగర్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున అభ్యర్థిని ఎందుకు పెట్టలేదు అని సవాల్ విసిరారు.
ఇటు ప్రతిపక్ష అధికార పార్టీలకు చెందిన నేతలు ఇరుపక్షాల సవాళ్లు విసురుకోవడంతో ప్రజా సమస్యలను పక్కకు పోవడం తప్పా ఈ రాజీనామా సవాళ్ల వల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే అధికార పార్టీ సవాల్ విసిరారు అని ప్రతిపక్ష పార్టీ నేతలు రాజీనామా చేయరు..ప్రతిపక్ష పార్టీ నేతలు సవాళ్ళు విసిరారని అధికార పార్టీ నేతలు రాజీనామా చేయరు. పోనీ ఇప్పట్లో ఏమైన ఎన్నికలు ఉన్నాయా అంటే అవి లేవు.
మరి ఈ రాజీనామా సవాళ్ల వలన ఏమి లాభం..?. ఎవరికి ఉపయోగం..?. రాజీనామా సవాళ్ల కంటే హామీలను అమలు చేయమని సవాళ్లు విసరాలి.. ధర్నాలు చేయాలి.. రాస్తోరోకులు చేయాలి. నాడు రాష్ట్ర సాధనలో తనకంటూ శైలీని సృష్టించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ నుండి ఇలాంటి రాజీనామా సవాళ్లను ప్రజలు ఆశించరు. తమకోసం రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేయడం.. తమకు న్యాయం చేయాలని పోరాడటం కోరుకుంటుంది.
అధికార పార్టీది ఏముంది. గత ఏడాదిన్నరగా డైవర్శన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలకిచ్చిన హామీలను పక్కకు పెట్టింది. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ కు చెందిన నేతలు అదే ట్రాఫ్ లో పడి ఒకరికొకరు రాజీనామా సవాళ్లు విసురుకుంటున్నారు. తెలంగాణ సమాజం కోరుకునేది ఇది కాదని రాజకీయ పార్టీల నేతలు ఎప్పుడు తెలుస్కుంటారో.. ఏమో.?
