హారీషన్న …నువ్వే మాకు దిక్కు..!

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావుకు ఓ చరిత్ర ఉంది. ఆయనో రూపాయి కాయిన్ ఫోన్ లీడర్.. వాట్సాప్ మెసేజ్.. ఓ ఫోన్ కాల్ చేస్తే రెస్పాండయి సమస్యలను తీరుస్తాడు అని. అదే హరీష్ రావు తమకు ఎదురై.. తమకండ్ల ముందుకు వస్తే కష్టాల్లో ఉన్నవాళ్లకు ఆ దేవుడే దిగోచ్చిండని సంబరపడి మరి తమ సమస్యలను.. కష్టాలను చెప్పుకుంటారు. అలాంటి సంఘటనే తాజాగా చోటు చేసుకుంది. మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు గండిపేట మండలం కాళీ మందిర్ వైపు వెళ్తున్నారు. ఆయన కాన్వాయ్ కానీ ఆయన ఉపయోగించే కారు కానీ కాస్తా తెలివి ఉన్న ప్రతోక్కర్కి నోటేడ్.
అలాంటిది ఆయన వస్తున్నాడని గమనించిన మున్సిపాల్ అధికారులు కూలగొడుతున్న షాపుల బాధితులు ఒక్కసారిగా ఆయన కారుకి అడ్డం పడ్డారు. మాములుగానే ప్రతీది గమనించే హారీష్ రావు వెంటనే కారుని ఆపించి మరి కిందకు దిగి వాళ్ల దగ్గరికెళ్లారు. ఒక్కసారికి హారీష్ రావును చూడగానే బాధితులు హారీషన్న మీరే మాకు దిక్కు.. మా షాపులను కూల్చివేస్తున్నారు కన్నీరుమున్నీరై తమ గోడును వెల్లబుచ్చుకున్నారు. దీంతో ఒక్కసారిగా చలించిపోయిన మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అక్కడ పేదల షాపులను కూలగొడుతున్న మున్సిపల్ అధికారులతో మాట్లాడుతూ “పేదల ఇండ్లు, దుకాణాలు అకస్మాత్తుగా కూలగొడితే ఎలా బతుకుతారు?..

ఉపాధి అవకాశాలను దెబ్బ తీయమని ఏ చట్టం చెప్పింది. ఎవరూ చెప్పారు మీకు అని ప్రశ్నించారు. ఆ తర్వాత బాధితులకు ధైర్యం చెప్పి, అక్కడి నుంచే బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కమిషనర్ తో ఫోన్లో మాట్లాడుతూ “ఇప్పటికే హైడ్రా పేరిట నగరంలో ఉన్న పేదల బతుకులు కూల్చారు. ఇప్పుడు దుకాణాలు కూల్చితే బతుకు దెరువు ఎట్లా ?.20,30 ఏళ్ల నుండి ఇక్కడి దుకాణాల పైనే ఆధారపడి జీవిస్తున్న వారి ఉపాధి పై దెబ్బకొట్టడం దుర్మార్గం అని నిలదీయడంతో హుటాహుటిన ఘటన వద్దకు సదరు కమిషనర్ చేరుకుని అక్కడ ఉన్న సిబ్బందిని వెళ్లమని ఆదేశించారు. దీంతో తమ పక్షాన నిలిచిన మాజీ మంత్రి హారీష్ రావుకు కృతజ్ఞతలు స్థానికులతో పాటు బాధితులు తెలిపారు. మీరే మాకు దిక్కు అయ్యారు హారీషన్న అని ప్రశంసించారు.
