కేటీఆర్ ,హారీష్ రావులు ఒకే పార్టీలో ఉండరా…?
మాజీ మంత్రులు కేటీఆర్ .. తన్నీరు హారీష్ రావులు ఒకే పార్టీలో ఉండరా..?. బీఆర్ఎస్ లో చీలికలు వస్తాయా అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ ప్రదేశ్ తెలంగాణ కమిటీ అధ్యక్షులు.. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ” ఏడాది మాపాలనలో సంక్షేమాభివృద్ధిని రెండు కండ్లలా భావించి ప్రజలకు సంక్షేమాభివృద్ధి ఫలాలను అందిస్తున్నాము..
దేశంలో ఎక్కడా లేనివిధంగా రెండు లక్షల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం మాది. మొత్తం ఇరవై రెండు లక్షల మంది రైతులకోసం పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేశాము.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్నాము..
ఐదోందలకు గ్యాస్ సిలిండర్ ను అందిస్తున్నాము. కేటీఆర్ హారీష్ రావులు ఒకే పార్టీలో ఉండరని జోస్యం చెప్పారు. త్వరలోనే బీఆర్ఎస్ కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారు అని వ్యాఖ్యానించారు. ఇక ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్తాము. అందులో భాగంగా తాను జిల్లాల పర్యటనకెళ్తాను అని తెలిపారు.