రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుండి దించాలనే పొంగులేటి ఆరాటం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని సీఎం కుర్చీ నుండి దించాలనే తెగ ఆరాటపడుతున్నారు అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురించి మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విసిరిన సవాల్ పై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఫిక్స్ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది..
ఈ ప్రభుత్వానికి చట్టాలు తెలియడం లేదు.. చుట్టారికాలు తెలియడం లేదు.. ముఖ్యమంత్రి భార్య తమ్ముడు కాదు అంటున్నారు.. ముఖ్యమంత్రి గారి భార్య సొంత తమ్ముడు కాకపోయిన బంధువుల తరపున తమ్ముడు ముఖ్యమంత్రి కి ఏమవుతాడు.. బామ్మర్ధే కదా.. ఇది అవినీతి చట్టం కిందకు వస్తుంది.. మంత్రి పొంగులేటి విసిరిన సవాళ్లను నేను స్వీకరిస్తాను…
ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గరకి పోదాం.. వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఎంక్వయిరీ చేయిద్దాం. సిట్టింగ్ జడ్జి గనుక ఇందులో తప్పులు ఎం జరగలేదు అంటే.. తాను రాజకీయ సన్యాసం చేస్తా. హైకోర్టు సీజే దగ్గరికి రాడానికి మంత్రిగారికి ఇబ్బంది ఉంది అంటే డేట్, టైం ఫిక్స్ చేయండి ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ దగ్గరికి పోదాం. మంత్రిగారికి, ముఖ్యమంత్రికి ఒకటే చెప్తున్నానని.. ఇప్పటికైనా టెండర్లు రద్దు చేయాలని ఆయన అన్నారు.