“పసుపు కండువా” కప్పుకోవచ్చుగా షర్మిల జీ…!
అదేమి విచిత్రం ఏపీపీసీసీ అధ్యక్షురాలు అయిన వైఎస్ షర్మిలను పసుపు కండువా కప్పుకోమని అంటున్నారా..?. కొంచెమైన తెలివి ఉందా..?. అని ఎక్కువగా ఆలోచించి మీ బుర్ర పాడు చేసుకోకండి. అసలు ముచ్చట ఏమిటంటే..?. ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి.. కనీసం ప్రతిపక్ష హోదా రాకపోవడానికి కారణాల్లో ఒకరు వైఎస్ షర్మిల .. కాంగ్రెస్ లో చేరడం.. పీసీసీ చీఫ్ అవ్వడం.. అక్కడ తన అన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం అని ఇటు వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ.. అటు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం కూడా.
అయితే అది నిజమో కాదో తర్వాత ముచ్చట కానీ తాజాగా ఏపీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు ఏలేరు, విజయవాడ పరిధిలోని బుడమేరు వాగు భారీ వర్షాల వల్ల వచ్చిన భారీ వరదలతో పరిసర ప్రాంతాల ప్రజల జీవితాలు అల్లకల్లోలమయ్యాయి. కొన్ని వేల కోట్ల నష్టం వాటిల్లింది. అయితే ఇక్కడ నాలుగు రోజులుగా ముందుగానే భారీ వర్షాలు వస్తాయని … దాంతో వరదలు వస్తాయని వాతావరణ శాఖ చెప్పిన కానీ కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ నష్టం అని వైసీపీ ప్రధాన ఆరోపణ. కండ్ల ముందు కన్పిస్తున్న వాస్తవం కూడా ఇదే. ఎందుకంటే వర్షాల గురించి వరదల గురించి తమకు ముందుగానే తెల్సు అని రాష్ట్ర సీఎస్ .. రెవిన్యూ సీఎస్ ఏకంగా ప్రెస్మీట్ లోనే చెప్పారు కూడా.
ఇంతవరకూ బాగానే ఉంది కానీ ప్రతిపక్ష పార్టీ అందులో ఒక్క సీటు లేని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వరదల గురించి మాట్లాడూతూ ఇంత వర్షాలు ఎందుకోస్తున్నాయో తెలుసా.. ఇది రెయినింగ్ సీజన్ కాబట్టి రెయిన్ వస్తుంది. అందుకే వరదలు.. ఈ భారీ వర్షాలు అని తనదైన శైలీలో మాట్లాడారు. అంతటితో ఆగకుండా వైఎస్ షర్మిల బుడమేరు వాగుకు వరదలు రావడం.. ఏలేరు ఆధునీకరణ పనులు చేపట్టకపోవడంతోనే అక్కడ ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఆగమయ్యారు. అందుకే ఈ నష్టం వాటిల్లింది. దీనికి ప్రధాన కారణం తన అన్న వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వమే అని విమర్షనాస్త్రాలను ఎక్కుపెట్టింది.
అయితే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం. వరదలు వర్షాలు వస్తాయని ముందే తెల్సిన ప్రజలను పట్టించుకోలేదు.. పట్టించుకోకపోగా పబ్లిక్ స్టంట్ లు.. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆ రాష్ట్రంలోని వరద బాధితులకు వరద పరిహారం ప్రకటిస్తే బాబు మాత్రం వైసీపీ పై ఆరోపణలు చేస్తూ రాజకీయం చేస్తున్నారు అని వరద బాధితులు ఇప్పటికే తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు..
ఇవన్నీ పక్కనెట్టి ప్రతిపక్షమైన వైసీపీని తప్పు పట్టడం ఎంతవరకు.. తప్పు చేసిందనో.. కూటమి మోసపు హామీలను నమ్మో ప్రజలు టీడీపీ కూటమికి అధికారాన్ని అప్పజెప్పారు. అప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా వైసీపీ & వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ఆరోపణలు చేయడం ఎంత వరకు కరెక్టూ. ప్రతిపక్షాన్ని విమర్షించడానికైతే కాంగ్రెస్ కు ఆ పదవికి రాజీనామా చేసి పసుపు కండువా కప్పుకోవచ్చుగా వైఎస్ షర్మిల జీ అని వైసీపీ శ్రేణులు, అభిమానులు,సానుభూతి పరులు విమర్షిస్తున్నారు. ఇది అన్నమాట అసలు ముచ్చట.