సారోస్తున్నారు….! ఇక యుద్ధమే…?
కేసీఆర్ అంటే ఓ చరిత్ర.. ఉద్యమం అయిన పోరుబాట అయిన … ప్రతిపక్షమైన.. అధికార పక్షమైన కేసీఆర్ ఉంటేనే బాగుంటదని విశ్లేషకులు పేజీలకు పేజీలు విశ్లేషిస్తారు. అలాంటి కేసీఆర్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం క్షేత్రస్థాయిలోకి రాలేదు.. అప్పుడప్పుడు ఆడదపాడదా ప్రత్యేక్షమవ్వడం తప్పా నిరంతరం జనంలో ఉన్నది తక్కువ.. ప్రతిపక్ష పాత్ర మాజీ మంత్రులు కేటీఆర్,హారీష్ రావు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు అనే నమ్మకం కావోచ్చు.. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కొంచెం సమయం ఇవ్వాలనే జిజ్ఞాస కావోచ్చు..కారణం ఏదైన కానీ కేసీఆర్ అయితే క్షేత్రస్థాయిలోకి వచ్చింది లేదు..
గతంలో రైతులను పరామర్శించడానికి వచ్చిన సందర్భం ఒక్కటి తప్పా ఎక్కడ కూడా కన్పించలేదు..నిన్న కాక మొన్న వరదలతో అతలాకుతలమైన ఖమ్మం ప్రజలను పరామర్శించడానికి ఒక్క మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు తప్పా ఆయన నేతృత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లడం .అక్కడి స్థానిక నేతలైన ఎంపీలు బండి పార్ధసారధి రెడ్డి,గాయత్రి రవిచంద్ర లాంటి వారు ఆర్థికసాయం చేయడం .. పలు కార్యక్రమాలు చేయడం … బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తమ నెల జీతం విరాళంగా ప్రకటించడం తప్పా బీఆర్ఎస్ చేసింది ఏమి లేదని ఆరోపణలు ఉన్నాయి.
ఇవన్నీ పక్కన పెడితే గులాబీ దళపతి.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వినాయకచవితి అవ్వగానే ఈ నెల పదో తారీఖునో.. పదకొండు తారీఖునో క్షేత్రస్థాయిలోకి దిగుతారని ఓ వార్తను బీఆర్ఎస్ శ్రేణులు వైరల్ చేస్తున్నారు. పదేండ్ల అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ.. ఎంపీ. మంత్రులకు అసలు అపాయింట్మెంట్ ఇవ్వరు అని ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మంత్రులు తుమ్మల,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించిన సంగతి తెల్సిందే.. అయితే తమ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమాభివృద్ధి ఫలాలు ప్రతోక్కర్కి అందుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కలవడం అవసరం లేదు..
ఏ సమస్య వచ్చిన పరిష్కారం అవుతున్న తరుణంలో ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం ఏంటి.. సమస్య తీరనప్పుడే కదా .. ముఖ్యమంత్రి పని చేయకపోతే పదేండ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచేదా..? అని అప్పట్లో మాజీ మంత్రి కేటీఆర్ ఓ ఇంటర్వూలో చెప్పారు కూడా.. అయితే తాజాగా కేసీఆర్ క్షేత్రస్థాయిలోకి రావడం బీఆర్ఎస్ శ్రేణులకు ఉత్సాహాం అందించే పరిణామం.. పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉండటం. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే మహోత్తర బాధ్యతను నెత్తిన పెట్టుకోవడంతో పార్టీ పునర్నిర్మాణంలో.. కార్యకర్తలకు అందుబాటులో లేరు అని కేసీఆర్ తో సహా పలువురు బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్న మాట..
ఇకపై అలాంటి సమస్య లేకుండా నేరుగా కేసీఆరే గ్రామ మండల నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయి నేతలతో సమావేశమవ్వడమే కాకుండా కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు 420 ఇతర హామీలపై ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పోరు నడపడానికి కేసీఆర్ పెద్ద స్కెచ్ తోనే ముందుకు వస్తున్నారు. పది నెలలు టైం ఇచ్చి వినాయకచవితి తర్వాత సారోస్తున్నారు.. ఇక యుద్ధమే అని బీఆర్ఎస్ శ్రేణులు మరో యుద్ధానికి సిద్ధమవుతున్నారు.. ఏది ఏమైన ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్,హారీష్ రావు తాకిడిని తట్టుకోలేకపోతున్న కాంగ్రెస్ కేసీఆర్ వస్తే ఎలా ఉంటదో మున్ముందు చూడాలి ఇక..!