8జిల్లాల్లో ఖాతా తెరవని వైసీపీ

 8జిల్లాల్లో ఖాతా తెరవని వైసీపీ

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీకి భారీ షాక్‌ తగలింది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు 175 సీట్లు గెలుస్తామన్న సీఎం..వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహాన్ రెడ్డి  అంచనాలు తలకిందులయ్యాయి.

ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం కేవలం 12 సీట్ల వద్దనే ఆ పార్టీ ఆగిపోయింది. వీటిలో కూడా ఒకటి రెండు సీట్లు కూడా ఎన్డీయే కూటమికే వెళ్లిపోయే అవకాశం కనిపిస్తోంది.

ఈ క్రమంలో ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే 8 జిల్లాల్లో వైసీపీ ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది.గత అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేసిన విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో ఈసారి వైసీపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. వీటితో పాటు కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో ఖాతా తెరవలేదు. అసెంబ్లీ స్థానాలు మార్చిన అందరూ ఓడిపోవడం గమనార్హం.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *