పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే క్లారిటీ

 పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే క్లారిటీ

ఏపీ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎమ్మెల్యే టీడీపీలో చేరనున్నట్లు వస్తోన్న వార్తలపై సదరు ఎమ్మెల్యే క్లారిటీచ్చారు.

కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి తనపై వస్తోన్న పార్టీ మార్పు  వార్తలపై స్పందిస్తూ నేను  పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు..

వైసీపీ టికెట్ పై గెలిచి పదవుల కోసమో..అధికారం కోసమో  టీడీపీలోకి వెళ్లేందుకు నా ఆత్మసాక్షి ఎలా ఒప్పుకుంటుంది? నేను పార్టీ మారడం లేదు.

దివంగత మాజీ సీఎం వైఎస్సార్  ఆశయాల కోసం మాజీ సీఎం..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి  పట్టుదలను చూసి వైసీపీలో చేరాను. జగన్ నన్ను ఎమ్మెల్యేగా నిలబెట్టి గెలిపించారు. ప్రతిపక్షంలో ఉంటూ పోరాటం చేస్తా. వదంతులు నమ్మవద్దు’ అని ఆయన ఈ సందర్భంగా  కోరారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *