మాజీ మంత్రి KTR కు మహిళా కమీషన్ నోటీసులు
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రాష్ట్ర మహిళా కమీషన్ నోటీసులు జారీ చేశారు. నిన్న గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” ఉచిత బస్సులో ఎల్లిపాయలు పొట్టు తీయడం తప్పు కాదని మా సీతక్క చెబుతుంది. మేము ఎప్పుడు అన్నాము అక్క ఎల్లిపాయలు పొట్టు తీయడం.. మేము ఎక్కడ కూడా తప్పు అనలేదు.
ఎల్లిపాయలు పొట్టు తీయడం కాకపోతే డాన్సులు.. బ్రేక్ డాన్సులు వేసుకోమను అక్క.. మేము మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్పు అని అనడం లేదు.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల బస్సులు సరిపోవడం లేదు ..బస్సుల సంఖ్య పెంచమని మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని.. మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము అని మంత్రి సీతక్క మాటలకు మాజీ మంత్రి కేటీఆర్ కౌంటరిచ్చారు..
మహిళల గురించి మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకోని నోటీసులు జారీ చేశామని మహిళా కమీషన్ చైర్ పర్శన్ నేరేళ్ల శారద అధికారక ట్విట్టర్ ఖాతా ఎక్స్ లో పోస్టు చేశారు. ఈ నెల ఇరవై నాలుగో తారీఖున కమీషన్ ముందు హజరు కావాలని కేటీఆర్ కు నోటీసులు జారీ చేశామని ఆమె ఎక్స్ లో పేర్కొన్నారు.