అల్లు అర్జున్ అరెస్ట్ తో తెరపైకి ఓటుకు నోటు కేసు..!
పాన్ ఇండియా మూవీ స్టార్ హీరో.. ఐకాన్ స్టార్ .. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు నిన్న శుక్రవారం ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. పాన్ ఇండియా మూవీగా ఇటీవల విడుదలైన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి మృతి చెందగా ఆమె తనయుడైన బాలుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు బాధ్యులుగా భావించిన పోలీసులు బన్నీని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. హైకోర్టును బన్నీ తరపున న్యాయవాదులు ఆశ్రయించగా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజు శనివారం ఉదయం ఐకాన్ స్టార్ విడుదల కానున్నారు.
బన్నీ అరెస్ట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ చట్టం పని తాను చేసుకుంటూ పోతుంది అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో గతంలో జరిగిన ఓ సంఘటనను ఇటు బన్నీ అభిమానులతో పాటు ప్రతిపక్ష పార్టీలు గుర్తుకు చేసుకుంటున్నారు. గతంలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా .. ఎమ్మెల్యేగా ఉన్న అనుముల రేవంత్ రెడ్డి ఓ ఎమ్మెల్యేను కొనబోయి అడ్డంగా దొరికిన సంఘటనను వీళ్లు ముందరేసుకున్నారు. చట్టం ముందు అందరూ సమానులే.
ముఖ్యమంత్రి అయిన సామాన్య మనిషి అయిన ఒకటే అని ఉకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసు గుర్తుకు రావడం లేదా..?. ఇటీవల అధికారంలోకి వచ్చాక రుణమాఫీపై కాంగ్రెస్ మాట తప్పడంతో చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దానికి కారణం ఎవరూ ..?. మీరు కాదా..?. మీ సొంత నియోజకవర్గ కేంద్రంలో ఓ మాజీ సర్పంచ్ మీ బ్రదర్స్ పేరు రాసి మరి ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి కారణం ఎవరూ మీకు తెలియదా..?. అందులో లేని ఆత్రురత బన్నీ విషయంలో ఎందుకు వచ్చింది. స్టేజీపై మీ పేరు మరిచిపోయినందుకా ఇదంతా అని వారు విమర్శిస్తున్నారు.