రజతోత్సవ వేళ బీఆర్ఎస్ పార్టీ పేరు మారుస్తారా…?

ఈ నెల ఇరవై ఏడో తారీఖున ఎల్కతుర్తిలో జరగనున్న రజతోత్సవ సభ సాక్షిగా బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చనున్నారా..?. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం వల్లనే ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో .. అటు ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైందా..?. బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్ గా మార్చాలని కార్యకర్తలు.. నేతల నుండి డిమాండ్లు అందాయా..?.
వీటిపై బీఆర్ఎస్ అధినేత.. మాజీ సీఎం కేసీఆర్ రజతోత్సవ వేళ కీలక ప్రకటన చేయనున్నారా..?. ఇలాంటి పలు ప్రశ్నలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ ప్రముఖ టీవీ న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో క్లారిటీచ్చారు. ఆయన ఇంటర్వూలో మాట్లాడుతూ బీఆర్ఎస్ గా మార్చిన దగ్గర నుండి టీఆర్ఎస్ గా మళ్లీ మార్చాలని ప్రతిపాదనలు వచ్చాయి.
రజతోత్సవ వేళ టీఆర్ఎస్ గా పార్టీ పేరును పునర్ నామకరణం చేయాలని జిల్లాల నుండి గ్రామాల నుండి నేతలు.. కార్యకర్తల నుండి డిమాండ్లు వచ్చాయి. కానీ ఇందుకు కేసీఆర్ గారూ ఒప్పుకోలేదు. రానున్న రోజుల్లో జాతీయ పార్టీలు సొంతంగా అధికారంలోకి రారు.
ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయి. తెలంగాణలో మళ్లీ మేము పుంజుకుంటాము. రాబోయే ఎన్నికల్లో మేము మళ్లీ గెలుస్తాము. కేంద్రంలో కీలకం అవుతామని పునర్ ద్ఘాటించారు. మాజీ మంత్రి కేటీఆర్ తాజా వ్యాఖ్యలతో ఇటు పార్టీ పేరు మార్చరు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ కాదు ప్రాంతీయ పార్టీ అని చెప్పకనే చెప్పారంటూ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
