గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్ అరెస్ట్..?
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నుండి అనుమతి రాగానే మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ అవ్వడం ఖాయమని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్నారు.
ఢిల్లీలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఫార్ములా ఈ రేసింగ్ కేసులో పలు అక్రమాలు జరిగాయి. అందుకే గవర్నర్ అనుమతి కోరాము.
గవర్నర్ నుండి అనుమతి రాగానే కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయం. ఈ కేసుల నుండి తప్పించుకోవడానికే కేటీఆర్ ఢిల్లీకి వచ్చారు. బీజేపీ అంతం చేయాలని కలలు కన్నవాళ్లు ఆ పార్టీకి చెందిన నేతలను ఎందుకు కలుస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.