కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా..?

Former KCR to the Assembly..!
ఈనెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మరి ఈ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు అవుతారా.. ?. లేదా అని మిలియన్ డాలర్ల ప్రశ్న.. అయితే కేసీఆర్ అసెంబ్లీకి రాకపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
ఆయన మాట్లాడుతూ ఈ నెల పన్నెండో తారీఖున జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని ఆయన స్పష్టం చేశారు. ‘బడ్జెట్ ప్రసంగంలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఆయన వచ్చన కానీ కాంగ్రెస్ నేతల అబద్ధాలు, దూషణలు పడాలా? ఇలాంటి నేతలున్న సభకు ఆయన రావాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం.
వీరి స్థాయికి మేం చాలు. ఆయన అవసరం లేదు’ అని తెలిపారు. ఈనెల 16 తర్వాత ఫార్ములా ఈ-రేసు కేసులో తనను మళ్లీ విచారణకు పిలుస్తారని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.