మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు ఎందుకు…?
మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ నాలుగు నాన్ బెయిల్ బుల్ కేసులు నమోదు చేసిన సంగతి తెల్సిందే. అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా కేటీఆర్ ఫార్ములా ఈ కారు రేస్ నిర్వాహణకు హెచ్ఎండీఏ నుండి క్యాబినెట్ అనుమతి లేకుండా.. ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా యాబై రెండుకోట్ల రూపాయలను ఓ ప్రవేట్ విదేశీ కంపెనీకి తరలించారనే కారణంతో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసును ఏసీబీకి అప్పజెప్పింది.
ఈ కేసు ఎందుకు కేటీఆర్ పై పెట్టారంటే పలువురు పలు విశ్లేషణలు చేస్తున్నారు. మంత్రిగా ఉండి అప్పటి క్యాబినెట్ అనుమతి లేకపోవడం.. ఫైనాన్స్ శాఖ క్లియరెన్స్ ఇవ్వకపోవడం లాంటి కారణాలతో నిధులను దుర్వినియోగపరిచారనే అభియోగంతో కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.
ఓ మంత్రిగా రాష్ట్రంతో పాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలనే ఇలా చేశారని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. మంత్రిగా సర్వాధికారాలను ఉపయోగించి మంచి పనికే చేశారు. తమ జేబుల్లో నింపుకోవడానికి కాదుగా అని మరికొంతమంది విశ్లేషిస్తున్నారు. చూడాలి మరి ఈ కేసు మరెన్ని మలుపులు తిరుగుతుందో..!