రేవంత్ టార్గెట్ కేటీఆరే ఎందుకు…?
అధికార కాంగ్రెస్ పార్టీ టార్గెట్ కేటీఆరే ఎందుకు..?. ముందుగా మిషన్ భగీరథ లో అవినీతి జరిగింది అన్నారు. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఆ తర్వాత డ్రగ్స్ అన్నారు. ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల రైతుల ఇష్యూలో మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్ట్ చేయడం ఖాయమంటున్నారు. మరి మీరే ఎందుకు కాంగ్రెస్ కు ప్రతిసారి టార్గెట్ అవుతున్నారు అని ఓ ప్రముఖ ఛానెల్ లో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న.
ఈ ప్రశ్నకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ .. మాజీ మంత్రి కేటీఆర్ సమాధానమిస్తూ ” ఇటు కాంగ్రెస్ పార్టీకి అటు ఆ పార్టీకి చెందిన నేతలను నేనంటే చాలా ప్రేమ అనుకుంటాను. ముందు మిషన్ భగీరథ లో అవినీతి జరిగింది. నన్ను అరెస్ట్ చేస్తామన్నారు. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో నేనున్నానని అన్నారు. ఆ తర్వాత డ్రగ్స్ కేసు అన్నారు. ఆ తర్వాత ఫార్ములా ఈ రేసింగ్ అన్నారు.
వీటన్నింటిలోనూ నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ప్రభుత్వానికి. కాంగ్రెస్ నేతలకు దొరకలేదు కాబట్టి లగచర్ల రైతుల గొడవలో నన్ను లాగుతున్నారు. చివరికి ప్రభుత్వాన్ని అస్థిర పరచాలనే కుట్రలో నేనున్నానని ఆరోపిస్తుంది. సాక్షాత్తూ ప్రధాన మంత్రినే మోడీయో.. బోడియో అన్నాను. ఈ చిట్టినాయుడికి నేను భయపడతానా.?. నేను నిజాయితీకి నిలువటద్దం అని కేటీఆర్ అన్నారు.