నోట్ల రద్ధు..మూసీ సుందరీకరణకు లింక్ ఏంటి…?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ లోని మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టును చేపట్టబోతున్న సంగతి తెల్సిందే. నాడు ప్రధానమంత్రి నరేందర్ మోదీ చేసిన నోట్ల రద్ధుకు.. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు లింక్ ఎలా మూసీ నదిపై ప్రజంటేషన్ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు. ఆయన మాట్లాడుతూ ” నోట్ల రద్ధు సమయంలో బడే భాయ్ ఏ విధంగా వ్యవహరించాడో.. ఇప్పుడు చోటా భాయ్ మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో అలాగే వ్యవహరిస్తున్నాడు.
నాడు పెద్ద నోట్ల రద్ధు సమయంలో ప్రధాన మంత్రి నరేందర్ మోదీ మాట్లాడుతూ ” మొదటి రోజు నల్లధనం బయటకు తీసుకురావడానికి అని చెప్పారు. వారం తర్వాత నల్లధనం ఒక్కటే కాదు దేశ వ్యాప్తంగా చెలామణీ అవుతున్న ఫేక్ కరెన్సీను బయటకు తీసుకురావడానికి అని చెప్పారు. మూడో వారం నల్లధనం, ఫేక్ కరెన్సీ నే కాదు ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి అని చెప్పారు.
నాలుగో వారం ఉగ్రవాదమే కాదు డిజిటల్ కరెన్సీ తీసుకురావడానికి అని చెప్పారు. ఇప్పుడు మూసీ సుందరీకరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకో మాట మాట్లాడుతున్నారు. మూసీ సుందరీకరణ అని ఒకరోజు అని అంటారు.. ఒక రోజేమో ప్రక్షాళన అని అంటారు. ఇంకో రోజేమో పునరుజ్జీవం, మరొకరోజు నల్లగొండకు మంచినీళ్లు అంటూ మాటలు మారుస్తున్నాడు.కమిట్మెంట్ డెడికేషన్ క్లారిటీ లేని పని మొదలెట్టినప్పుడే ఇలా వ్యవహరిస్తారని కేటీఆర్ కౌంటరిచ్చాడు.