కేటీఆర్ పై నమోదైన సెక్షన్లు ఏంటి..?
మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫార్ములా ఈ కారు రేస్ కు సంబంధించి ఏసీబీ నాలుగు నాన్ బెయిల్ బుల్ కేసులు నమోదు చేసిన సంగతి తెల్సిందే.
అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(ఏ), 13(2), BNS 409, 120(బీ) సెక్షన్ల కింద మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1 గా మాజీ మంత్రి కేటీఆర్ , ఏ2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలను చేర్చారు. నాలుగు నాన్ బెయిల్ బుల్ కేసులు నమోదు చేశారు.
అసలు ఈ సెక్షన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాము..13(1)(ఏ): ప్రజాప్రతినిధి తన స్వప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం లేదా తన అధీనంలోని వారికి లబ్ధి చేకూర్చడం. 13(2): ప్రజాప్రతినిధి నేరాలకు పాల్పడటం. 409: ఆస్తుల్ని సంరక్షించాల్సిన ప్రజాప్రతినిధి తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయడం, 120(B): చట్టవిరుద్ధమైన పని చేసేందుకు కుట్ర పన్నడం కింద నమోదు చేసింది.