జగన్ కు విజయసాయిరెడ్డి కౌంటర్..!
ఏపీ మాజీ సీఎం..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటు రాజ్యసభ పదవికి.. అటు పార్టీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన అంశంపై స్పందిస్తూ రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత..క్యారెక్టర్ ముఖ్యం.. పార్టీలకు రాజీనామా చేసి కష్టకాలంలో క్యాడర్ ను పార్టీని వదిలేయడం వారి విజ్ఞతకు వదిలేస్తున్నాను.
రాజకీయాల్లో ఉన్నప్పుడు భయం ఉండకూడదు. నమ్ముకున్న క్యాడర్ కు..నమ్మిన నాయకుడికి అండగా ఉండాలని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ నేను ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు.
నా మొత్తం వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత ఉన్నాయి..నేను మంచి
క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ప్రలోభాలకు లొంగలేదు..
భయం అనేది నాలో ఏ అణువులోనూ లేదు
అందుకే రాజ్యసభ, పార్టీ పదవులను వదులుకున్నాను అని తన ఎక్స్‌లో విజయసాయిరెడ్డి పోస్టు చేశారు..