రేవంత్ రెడ్డికి టీపీసీసీ బిగ్ షాక్…!

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఉన్న సంగతి తెల్సిందే. గురువారం గాంధీభవన్ లో మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బిగ్ షాకిచ్చారు. మీడియాతో మహేష్ కుమార్ మాట్లాడుతూ కంచగచ్చిబౌలి భూముల్లో జింకలు ఉన్నాయి. నెమళ్లు ఉన్నాయి. అక్కడదాక ఎందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చెందిన ఢిల్లీలో ఆయన ఇంట్లో నెమళ్లు ఉన్నాయి.
లేవని ఎవరూ అన్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు మేము ఆభూముల్లో మొక్కలను చెట్లను బుల్డోజర్లతో కొట్టేశాము అని ఆరోపిస్తున్నారు. మేము బుల్డోజర్లను వాడలేదు. జేసీబీలను వాడి మొక్కలను .. చెట్లను కొట్టేశాము అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో అసలు అక్కడ అడవే లేదు.
నెమళ్లు లేవు.. జింకలు లేవు అని ఊదరగొడుతూ ఉన్నాయని చెప్పినవాళ్లపై కేసులు పెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. మంత్రులకు పీసీసీ చీఫ్ బిగ్ షాకిచ్చారు అని ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తున్నారు. అక్కడ మొక్కలు చెట్లను కొట్టకపోతే జేసీబీలను ఎందుకు వాడారు. సుప్రీం కోర్టు ఎందుకు మొట్టికాయలు వేసిందని ఈసందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు.
