జగన్ కు ఈడీ బిగ్ షాక్ – ఆస్తులు జప్తు..!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి ఈడీ బిగ్ షాకిచ్చింది. దాదాపు పద్నాలుగేండ్ల నుండి కొనసాగుతున్న మనీ ల్యాండరింగ్ కేసులో మాజీ సీఎం జగన్ కు చెందిన ఆస్తులను ఆటాచ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.
ఇందులో భాగంగా జగన్ ,దాల్మియా సిమెంట్ సంస్థలకు చెందిన దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలను జప్తు చేసింది.
అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 2009-14మధ్యలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నమోదైన అవినీతి ఆరోపణల కేసులో భాగంగా ఈడీ ఈ చర్యలను తీసుకుంది.
