మంత్రులపై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గోన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అదే పార్టీకి చెందిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఇటీవల క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఆ సమావేశంలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్టు పూర్తి చేయడానికి రూ.4000 కోట్లను అంచనాలు పెంచారు. ఎందుకు అంత పెంచారు అని అడిగితే అది గత పాలకుల తప్పు వల్ల పెంచామని చెబుతున్నారు.
గత పాలకులంటే ఎవరూ ఇదే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,ఇదే తుమ్మల నాగేశ్వరరావు, ఇదే పోచారం శ్రీనివాస్ రెడ్డిలే కదా బీఆర్ఎస్ పాలనలో మంత్రులు.. ఇప్పుడు ఈ నాలుగు వేల కోట్లు బీసీల నుండి వసూలు చేస్తారా..?. మీరు గత పాలకులల్లో మంత్రులే కదా .. వెళ్ళి కేసీఆర్ ఇంట్లో నుండి తీసుకురండి అని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మీరు ఓ లుక్ వేయండి..