మాజీ మంత్రి కేటీఆర్ కారుపై దాడి

Kalvakuntla Taraka Rama Rao Former Minister & Working President – BRS Party
హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంత బాధితులను పరామర్శించడానికి మాజీమంత్రి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం ఈరోజు మంగళవారం అంబర్ పేట నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
ఈక్రమంలో ముషీరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు .. కార్యకర్తలు మాజీ మంత్రి కేటీఆర్ కారుపై ఎక్కి దాడికి దిగారు.
అంతేకాకుండా కేటీఆర్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ శ్రేణులు అక్కడున్న కాంగ్రెస్ వాళ్ళను చెదరగొట్టారు.
