మేడిగడ్డ కూలింది అందుకే – మంత్రి పొంగులేటి

Ponguleti Srinivas Reddy
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పీసీ ఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇచ్చిన నివేదికను నీళ్ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. దీనిపై అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యుల మధ్య చర్చ వాడీవేడిగా జరుగుతుంది. ఈ క్రమంలో రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు కూలిందో సభలో వివరించారు. ఆయన మాట్లాడుతూ ” మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కట్టేటప్పుడు డయాఫ్రమ్ వాల్ ను కాంక్రీట్ తో కాకుండా సీకెంట్ ఫైల్ వాల్ టెక్నాలజీతో కట్టడం వల్లనే ఆ బ్యారేజీ కూలిందని అసెంబ్లీలో ఆరోపించారు.
మేడిగడ్డలో కేసీఆర్ కు ఉన్న ఫామ్ హౌజ్ లోని బావి సైజులో రంధ్రం పడింది . తన మామ, మాజీ సీఎం కేసీఆర్ చెప్పారు. అల్లుడు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు పాటించారు. ఒకే రకమైన టెక్నాలజీతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టారు. ఇప్పుడు ఆ మూడు బ్యారేజీలు ప్రమాదంలో పడ్డాయి. కేవలం కాళేశ్వరం పేరుతోనే లక్ష కోట్ల అవినీతి చేశారని ఆయన ఆరోపించారు.