బీఆర్ఎస్ ,కాంగ్రెస్ కు ఉన్న తేడా ఇదే..?

BRS VS Congress
బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న తేడా ను మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న శుక్రవారం తెలంగాణ భవన్ లో జరిగిన మూసీ నదిపై ప్రజంటేషన్ కార్యక్రమంలో వివరించారు. ఆయన మాట్లాడుతూ ” మా పాలనలో హైదరాబాద్ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా భారీ వరదలు వచ్చాయి.
అప్పుడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైదరాబాద్ లోని ప్రతి ఇంటికి పదివేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. నిర్ణయం తీసుకున్న కొద్ది గంటల్లోనే సుమారు ఆరు వందల డెబ్బై కోట్లరూపాయలను వరద బాధితులకు అందజేసిన ఘనత బీఆర్ఎస్ ది. మొన్న ఖమ్మం చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చాయి.
ఖమ్మం అంతా మునిగిపోయింది. ముఖ్యమంత్రితో సహా క్యాబినెట్ అంతా అక్కడకెళ్లింది. వరద బాధితులకు ప్రతి ఇంటికి పదిహేను వేలు ఇస్తామని ప్రకటించారు. ప్రకటించిన నెలన్నర అయిన కానీ పదిహేను పైసలు కూడా ఇవ్వలేదు. ఇది కాంగ్రెస్ ఘనత .. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య ఉన్న తేడా ఇదే అని ఆయన అన్నారు.
