యువతకు పెద్దన్నగా అండగా ఉంటా
తెలంగాణ రాష్ట్రంలోని యువతకు పెద్దన్నగా అండగా ఉంటాను.. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేశాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గొల్కోండ కోటలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి ఉత్సవాలను ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ” పదేండ్లలో నిరుద్యోగులను, యువతను పట్టించుకోలేదు గత ప్రభుత్వం .. కానీ తాము అలా కాదు. వచ్చి రాగానే ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేశాము. గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు నిలయమైన టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశాము.
గ్రూప్ -1 ప్రిలిమినరీ, పదకొండు వేల అరవై రెండు టీచర్ల పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించాము. వయోపరిమితిని నలబై ఆరు ఏండ్లకు పెంచాము. మీ సమస్యలు ఏమైన ఉంటే మా దృష్టికి తీసుకురండి.. మేము పరిష్కరిస్తాము. చెప్పుడు మాటలు వినకండి.. మీ భవిష్యత్తును నాశనం చేస్కోకండి. పెద్దన్నగా మీకు అండగా ఉంటాను “అని ఆయన పిలుపునిచ్చారు.