కూల్చివేతలపై ఉన్న సోయి పూడ్చివేతలపై లేదు

Thanneeru Harish Rao Former Minister
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి హైడ్రా పేరుతో కూల్చివేతలు తెలుసు. కానీ సాగర్ కాలువకు గండి పడిన ఇరవై ఒక్కరోజులు అయిన కానీ పూడ్చివేతలు తెలియదు అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు.
తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడూతూ ” హైడ్రా వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు. పేదవాళ్లకు నోటీసులు ఇచ్చిన రాత్రికి రాత్రే వెళ్లి వాళ్ల నివాసాలు కూల్చివేస్తారు. అదే ధనవంతులు.. వాళ్ల అనుచరులకైతే నోటీసులు ఇచ్చి నెల రోజులు సమయం ఇస్తారు తప్పా కూల్చివేయరు.
సాగర్ కాలువకు గండి పడి ఇరవై రోజులవుతున్న కానీ ఎందుకు పూడ్చివేయలేదు.. ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాలో భక్తరామదాసు,సీతారామ ప్రాజెక్టుల నుండి రైతులకు నీళ్లు ఎందుకివ్వలేదు. రైతులను ఆగం పట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తుంగలో తొక్కారు అని ఆయన ఫైర్ అయ్యారు.