కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరం…!

 కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరం…!

The condition of the farmers is unbearable

ఖమ్మం మార్కెట్ లో పత్తి మిర్చి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు MLC తాతా మధుసూదన్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు వెంకటవీరయ్య ,‌ కొండబాల కోటేశ్వరరావు, బానోతు చంద్రావతి, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, ఏనుగుల రాకేష్ రెడ్డి, మాజీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ Y శ్రీనివాస్, Rjc కృష్ణ మరియు తదితరులు.బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలోనే మా రైతులకు మేలు జరిగిందంటూ మంత్రి హరీష్ రావు గారికి తమ గోడును చెప్పుకున్న రైతులు..రైతులతో నేరుగా మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్న నేతలు..ఖమ్మం మార్కెట్లో పత్తి కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యాన్ని మాజీ మంత్రులకు చెప్పుకున్న రైతులు..అనంతరం మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకరైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

బోనస్ మాట బోగస్ అయింది మద్దతు ధర కూడా రావట్లేదు.6500 రూపాయలు కూడ మద్దతు ధర పత్తికి రాలేదు.పత్తి ప్రతి క్వింటాకు రైతుకు 1500 నష్టం వాటిల్లుతుంది.లక్షా ఇరవై వేల మెట్రిక్ టన్నులు కూడా పత్తి కొనలేదు మొత్తం దళారులకే పోతుంది.ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం కుట్రలు చేయడం తప్ప కాంగ్రెస్ చేసింది జీరో.వరి,పత్తి పంట దళారుల పాలు అవుతుంది ప్రభుత్వం ఏమి చేస్తోంది.రైతు బంధు లేని రుణమాఫీ లేని మద్దతు ధర లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పత్తికి గరిష్టంగా 11 వేలు కనిష్టంగా 9 వేలు ధర పలికింది.. ఇప్పుడు ఎందుకు ధర తగ్గింది.పత్తి రైతులకు మద్దతు ధర రావాలి 500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం ను డిమాండ్ చేస్తున్నాం.సిసిఐ రైతుల దగ్గర కొనట్లేదు దళారుల దగ్గర కొంటున్నారు.మిర్చి కి 13 వేలు కూడా రాటల్లేడు.కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కోటలు చేతలు గడప దాటల్లేదు.జిల్లా మంత్రులు ఆధిపత్యం కోసం బాగా బిజీ అయ్యారు.

ప్రజా సమస్యలను గాలి కొదిలి గొప్పలుకు పోతున్నారు.సన్నాలకు బోనస్ కూడా ఇవ్వట్లేదు.ఖమ్మం జిల్లాలో సన్నాలు 4 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం పండింది.ఒక్క రైతుకు అయినా బోనస్ ఇచ్చారా మొత్తం దళారులు కొంటున్నారు.ఆంధ్రా దళారులు వరి ధాన్యం కొనుక్కొంటున్నారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి కి వాళ్ళ కమిషనర్ మాటలకే తేడా ఉంది.ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంధాలయం చైర్మన్ ఖమార్, మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, రూలర్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు, ఖమ్మం నగర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, రఘునాథ్ పాలెం మండలం అధ్యక్షుడు వీరు నాయక్, తెలంగాణ ఉద్యమకారులు ఉప్పల వెంకటరమణ, బొమ్మ రామ్మూర్తి, తాజుద్దీన్, రైతు అనుబంధ సంఘాల నాయకులు, స్థానిక కార్పొరేటర్లు మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *