“భరత్ అనే నేను” ని గుర్తుకు తెచ్చిన BRS నేతల అరెస్ట్ సీన్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అసెంబ్లీ కమిటీలల్లో పీఏసీ చైర్మన్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన శేరిలింగం పల్లి ఎమ్మెల్యే అరికెలపూడి గాంధీకి ఇచ్చింది. రాజ్యాంగం ప్రకారం .. అసెంబ్లీ నియమావళి ప్రకారం పీఏసీ చైర్మన్ గిరి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు ఇవ్వాలి. అలాంటప్పుడు మా పార్టీ నుండి మీ పార్టీలో చేరిన ఎమ్మెల్యే అరికెలపూడి గాంధీకి ఎలా ఇస్తారు అని బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశాలు పెట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని … ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు.
” పీఏసీ చైర్మన్ ” పై ఎమ్మెల్యే అరికెల పూడి గాంధీ స్పందిస్తూ ” నాకు కాంగ్రెస్ లో చేరినందుకు ఇవ్వలేదు.. నేను పార్టీ మారలేదు.. నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను. నియమావళి ప్రకారమే నాకు ఇచ్చారు” అని మాట్లాడారు. దీంతో పాడి కౌశిక్ రెడ్డి పార్టీ మారిన వాళ్లకు గాజులు,చీరలు పంపుతాము.. గాంధీ మా పార్టీలోనే ఉంటే గులాబీ కండువా కప్పి గులాబీ బాస్ దగ్గరకు తీసుకెళ్తాము.. లేదంటే మీడియాకు చూపిస్తూ ఈ చీరలు,గాజులు నేనే స్వయంగా ఇంటికెళ్లి ఇస్తాను అనడం రోజు వ్యవధిలో ఎమ్మెల్యే గాంధీ తన అనుచరులంతా పాడి ఇంటికెళ్లి దాడి చేయడం.. బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి మహబూబ్ నగర్ జిల్లా అంతటా తిప్పడం క్షణాల్లో జరిగిపోయింది.
ఇక్కడే బీఆర్ఎస్ క్యాడర్లో జోష్ పెరగడానికి పునాధులు పడ్డాయి..భరత్ అనే నేను మూవీలో ఓ సీన్ ను గుర్తుకు తెచ్చే ఓ పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రులుతన్నీరు హారీష్ రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి,ఎమ్మెల్యేలు,ఎంపీలను అరెస్టు చేసి మూడు బృందాలుగా విభజించి ఓ బృందాన్ని శ్రీశైలం హైవే రోడ్డువైపు.. ఇంకో బృందాన్ని బెంగళూరు హైవే వైపు.. ఇంకో బృందాన్ని నాగాపూర్ వైపు నడిరాత్రి దాక రోడ్లపై తిప్పి చివరికి కల్వకుర్తి నియోజకవర్గంలోని కేశం పేట పోలీసు స్టేషన్ కు తరలించారు. ఆర్ధరాత్రి ఒంటిగంట తర్వాత స్థానిక MLC నవీన్ కుమార్ రెడ్డి పూచికత్తుపై అందర్ని విడుదల చేశారు..
నిన్న సాయంత్రం ఆరు గంటలకు అరెస్ట్ చేసి సైబరాబాద్ కమీషనరేట్ నుండి మొదలైన ఈ అరెస్ట్ హైడ్రామా కేశం పేట పీఎస్ కు చేరేలోపు గ్రామగ్రామాన పల్లెపల్లెన గులాబీ శ్రేణులు పోలీసు వ్యాన్లకు ఎదురోచ్చి మరి అడ్డంగా నిలబడి పోయారు. కొన్ని చోట్ల అయితే జేసీబీలతో ట్రాక్టర్లతో ఆ వ్యాన్లకు అడ్డుపెట్టి మా పార్టీ నేతలను ఎందుకు అరెస్ట్ చేశారు. ఎక్కడకి తీసుకెళ్తారు.. వెంటనే మా గ్రామాల్లో వదిలేయండి.. మా పల్లెల్లో వదిలేయండి అంటూ నినాదాలతో ధర్నాలతో గులాబీ క్యాడర్ తో పాటు స్థానిక ప్రజలు బీఆర్ఎస్ నేతలకు అండగా.. రక్షణగా నిలిచారు. .
అఖరికి పన్నెండు గంటలకు కేశం పేట పీఎస్ కు చేరుకున్న మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు బృందానికి దాదాపు పదివేల మంది బీఆర్ఎస్ శ్రేణులు, స్థానిక ప్రజలు అక్కడకి చేరుకుని బెయిల్ పై విడుదల అయ్యేవరకు ఆర్ఆర్ దిగిన దగ్గర నుండి కేశం పేట వరకు గ్రామం ప్రారంభం సరిహద్దు నుండి ఆ గ్రామ చివరి వరకు “భరత్ అనే నేను “అనే మూవీలో హీరో మహేష్ బాబు తనపై జరిగిన కుట్రలను తెలుసుకోవడానికి వెళ్తే రౌడీలు అతన్ని చుట్టిముడితే ప్రజలే ఆ హీరో కారుకు భద్రతగా తన గమ్యం చేరేవరకు ఉన్న సీన్ ను గుర్తుకు తెస్తూ బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసిన వ్యాన్ల చుట్టూ ఉన్నారు . అధికారం కోల్పోయిన తర్వాత తీవ్ర నిర్వేధంలో ఉన్న గులాబీ క్యాడర్ కు ఈ పరిణామం మంచి జోష్ ను తెప్పించింది.