అందుకే కల్వకుంట్ల కుటుంబంలో విబేధాలు

Ramachandra Rao Telangana BJP chief
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి సొమ్మును పంచుకోవడంలో విబేధాలు రావడంతోనే కల్వకుంట్ల కుటుంబంలో విబేధాలు మొదలయ్యాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రాంచంద్రరావు ఆరోపించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైందని ఆయన అన్నారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని డైవర్షన్ చేయడానికి కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.