అందుకే ఆయన ” హారీష్ రావు”…?
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అసెంబ్లీలోనైన.. మీడియా సమావేశంలోనైన.. ప్రభుత్వ కార్యక్రమాల సమీక్ష సమావేశంలోనైన ఒక అంశంపై మాట్లాడారంటే దానిపై ఎంతగానో రీసెర్చ్ చేసి మరి సబ్జెక్టూతో మాట్లాడుతారు. ఎదుటివాళ్లు దానికి సమాధానం ఇవ్వలేనంతగా ఉంటుంది మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడే ఏ విషయమైన.
తాజాగా ఈరోజు ఉదయం పదకొండు గంటలకు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు.. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నేతృత్వంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారి నివాసంలో శేరిలింగంపల్లి నియోజవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఉంది. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు,పార్టీ నేతలతో ముఖ్య సమావేశం ఉంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు.. ఎమ్మెల్యేలు హాజరు కావాలి.. అయితే ఈ విషయం ఎక్కడకి దారీ తీస్తుందో అని పోలీసు అధికారులు ఎక్కడక్కడ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులను ముందస్తుగా హౌజ్ అరెస్టులు చేశారు.. కొంతమందిని పోలీసు స్టేషన్లకు తరలించారు.
అఖర్కి నిన్న తీవ్రంగా గాయపడిన మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఏకంగా పోలీస్ కారులోనే ఏఐజీ ఆసుపత్రికెళ్లి చికిత్స చేయించుకున్నారు అంటేనే ముందస్తు అరెస్టుల తీవ్రత ఎంతగా ఉందనేది ఆర్ధమవుతుంది.ఈ విషయం గురించి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” ఈ రోజు బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేసినట్లుగా నిన్న ఎమ్మెల్యే అరికెలపూడి గాంధీని ఎందుకు అరెస్ట్ చేయలేదు.. ఆయన ఎమ్మెల్యే పాడి ఇంటీకెళ్ళేదాక పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎందుకు చర్యలు తీసుకోలేదు.
ప్రభుత్వం కావాలనే దగ్గర ఉండి మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడేలా ఎమ్మెల్యే గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులకు మద్ధతు తెలిపింది. ఈ దాడికి ముఖ్య కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే.. ముందుగానే అరెస్ట్ చేస్తే ఇష్యూ ఇంతదాక వచ్చేది కాదు కదా.. పైకి ఇదేమి న్యాయం అని ప్రశ్నించడానికి.. న్యాయం చేయమని పోలీస్ స్టేషన్ గడపను తొక్కితే మమ్మలందర్నిఆర్ధరాత్రి అని చూడకుండా హైదరాబాద్ నుండి తీసుకెళ్లి మహబూబ్ నగర్ జిల్లా అంతటా తిప్పారు.
ఇదేక్కడి న్యాయం. మీరు ఇవాళ మాపై వేసిన రాళ్ళే రేపటి మా ప్రభుత్వానికి పునాదులు.. ఎవర్కి అధికారం శాశ్వతం కాదు. ఇవాళ మీరు.. రేపు మేము అని హెచ్చరించారు. మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు చెప్పినట్లుగా ముందస్తుగా అరికెలపూడి గాంధీని అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో తాజా పరిస్థితులు నెలకునేవి కావు కదా.. ఆయన ఏమి మాట్లాడిన లాజిక్ కంటెంట్ సబ్జెక్టుతో మాట్లాడ్తారనడానికి ఇదోక ఊదాహరణ.. అందుకే అయన హారీష్ రావు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.