That Is PSPK
సహజంగా ఎవరైన ఉన్నత స్థాయికెదగాలంటే..ఏదైన సాధించాలంటే అందరూ కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలంటారు.. ఏపీలో అధికార వైసీపీ పార్టీని నేలకు దించడమే కాదు ఏకంగా ఏపీ చరిత్రలోనే తిరుగులేని మెజార్టీని కూటమికి అందించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అదే చేశారు.
తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన పవన్.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో అప్పటి అధికార వైసీపీ కు చెందిన సీఎం జగన్ నుండి కింది స్థాయి కార్యకర్త వరకు అంతా పవన్ కళ్యాణ్ ను ఎమ్మెల్యేగా అసెంబ్లీ గేటు తాకనీయబోమన్న వారికి ఓ రేంజ్ సమాధానమిది.
ఏకంగా డిప్యూటీ సీఎంగానే అసెంబ్లీలో పవన్ అడుగు పెట్టబోతున్నారు. వాస్తవానికి ఆయన విజయం కూడా ఓ అద్భుతమే. 70 వేలకు పైగా మెజారిటీతో పిఠాపురం నుంచి విజయం సాధించారు. ఇంత మెజారిటీ అంటే మాటలు కాదు. పిఠాపురంలో పవన్ గెలవరంటూ వైసీపీ నేతలు నానా రచ్చ చేశారు.
తను మాత్రమే కాదు.. తన పార్టీ తరుఫున బరిలో నిలిచిన వారందరినీ గెలిపించుకున్నారు. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న పవన్‌ను ఏపీ ప్రజలు పూర్తిగా నమ్మారు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బును రైతులకు సాయంగా ఇచ్చారు. 2019లో రెండు చోట్ల పోటీ చేసి ఓడినా కూడా పవన్ ఏపీని వీడలేదు. ప్రజలకు ఎప్పటికప్పుడు అండగా నిలిచారు. టీడీపీ అధినేత చంద్రబాబు జైలు పాలైనప్పుడు ఆ పార్టీకి అండగా నిలిచారు పవన్ కళ్యాణ్.