సీఎం రేవంత్ పై తెలంగాణ సినీ సంగీత దర్శకుల సంఘం ఆగ్రహాం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి..టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర సినీ సంగీత కళాకారుల సంఘం తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు..
జూన్ రెండో తారీఖున అధికార గీతంగా విడుదల చేయనున్న ‘జయజయహే తెలంగాణ’ పాటకు ఆంధ్రా ప్రాంతానికి చెందిన ప్రముఖ అస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణిని సంగీతం అందించమనడం చారిత్రక తప్పిదమని సీఎం రేవంత్ కు తెలంగాణ సినీ మ్యుజీషియన్స్ అసోసియేషన్ లేఖ రాసింది.
‘మన ఉద్యోగాలు మనకే రావాలని, మన అవకాశాలు మనకే కావాలనే నినాదంతోనే ఆరు దశాబ్ధాల అనంతరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది.
అలాంటిదిప్పుడు మన రాష్ట్ర గీతాన్ని పక్క రాష్ట్రాలవారు పాడటం ఏంటి? అలా చేయడమంటే తెలంగాణ కళాకారులను అవమానించడమే. ఈ గొప్ప అవకాశం మనవాళ్లకే ఇవ్వాలి’ అని వారు ఈ సందర్భంగా సీఎంను కోరారు.