ఏపీకి తెలంగాణ ప్రాజెక్టు..!

Telangana project for AP..!
హైదరాబాద్ మార్చి 7 (సింగిడి)
తెలంగాణకు సంబంధించిన ఓ ప్రాజెక్టు పక్కనున్న ఏపీకి తరలడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ .. మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఎక్స్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో తెలంగాణకు తీసుకోచ్చిన పెట్టుబడులను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకోలేకపోతుంది అని విమర్శించారు. ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ కంపెనీకి చెందిన రూ.1700కోట్ల సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టు గతంలో తెలంగాణలో ఏర్పాటుకు సుముఖంగా ఉంది.
కానీ తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం విధానాల వల్ల అది ఏపీకి తరలిపోయింది. గుజరాత్ రాష్ట్రానికి కేన్స్ .. తమిళనాడు రాష్ట్రానికి కార్నింగ్ ను వదిలేశాడు. ఇప్పుడు ప్రీమియర్ ఏపీకి వదిలేశారని ఎక్స్ లో ట్వీట్ చేశారు కేటీఆర్.
