గతి తప్పుతున్న తెలంగాణ రాజకీయాలు..?

 గతి తప్పుతున్న తెలంగాణ రాజకీయాలు..?

Telangana Politics

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అసలు టార్గెట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా మాజీ మంత్రి కేటీఆరా..?. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా పట్టుబడటంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించి మరి చర్లపల్లి జైలుకు తరలించారు. అక్కడితో ఆగకుండా గత సార్వత్రిక ఎన్నికలు(2018) సమయంలో కొడంగల్ లో తెల్లారుజామునే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించారు. ఏకంగా తన కూతురు పెళ్ళికి బెయిల్ పై బయటకు రావాల్సి వచ్చింది. అప్పుడే రేవంత్ రెడ్డి శపదం చేశారు. తెలంగాణకు కాబోయే రెండో ముఖ్యమంత్రి నేనే.. కేసీఆర్ అండ్ ఫ్యామిలీను వదిలిపెట్టను అని అప్పట్లోనే శపదం చేసి కూర్చున్నారు.

గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును చూస్తుంటే రేవంత్ రెడ్డి అప్పటి కక్షను ఇప్పుడు తీర్చుకునేలా ఉందని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే జన్వాడ ఫామ్ హౌస్ లో కేటీఆర్ బామ్మర్ధి రాజ్ పాకాల కుటుంబం. తనకు చెందిన విజయ్ మద్దూరి అనే ఇంకో సహచరుడి ఫ్యామిలీతో దీపావళి వేడుకలకు సంబంధించి పార్టీ జరిగింది. ఈ పార్టీపై ఎస్ఓటీ దాడులు నిర్వహించారు. కేవలం విదేశీ మద్యం గురించి అనుమతి లేదనే కారణంతోనే కేసులు పెట్టారు. అయితే దీన్ని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు.. ఇటు బీజేపీ నేతలు డ్రగ్స్ పార్టీగా.. రేవ్ పార్టీగా చిత్రీకరిస్తున్నారు.

మాజీ మంత్రి కేటీఆర్ ను ఏదోక అంశంలో ఇరికిచ్చి తనపై ఉన్న ఓటుకు నోటు కేసు మాదిరిగా కేటీఆర్ పొలిటికల్ కేరీర్ లో మాయని మచ్చలా చేయాలనే ఆరాటంతోనే ఇలా చిత్రీకరిస్తున్నారు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు డిపార్ట్మెంట్ ఏమో కేవలం అనుమతి లేదని చెబుతుంది. మరోపక్క ఏమో అధికార పార్టీ.. వారి అనుకూల మీడియా ఇది రేవ్ పార్టీ.. డ్రగ్స్ పార్టీ.. ఈ పార్టీలో కేటీఆర్.. ఆయన సతీమణి శైలిమా ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారు. రాజకీయంగా ఎన్ని విమర్శలు అయిన చేయచ్చు.. ఏమైన అనోచ్చు కానీ అసలు సంబంధం లేని శైలిమాను లాగడం ఎంతవరకూ సబాబు అని వారు ప్రశ్నిస్తున్నారు. ఓ రేవ్ పార్టీలో.. డ్రగ్స్ పార్టీలో ఆడవాళ్లు ఉన్నారని పబ్లిసిటీ చేస్తే ఆ కుటుంబం ఎంతగా నరకం.. మానసిక వేదన పడుతుందో అందరికి తెల్సిందే ఓ కుటుంబంలో మహిళ డ్రగ్స్ పార్టీ.. రేవ్ పార్టీలో ఉందంటే ఆ కుటుంబానికి ఎంత అప్రతిష్ట. ఆ కుటుంబంపై సమాజం చూపు ఎలా ఉంటుంది. . ఒకవేళ అధికార పార్టీ లక్ష్యం అదే అయితే తెలంగాణ రాజకీయాలు లయ తప్పినట్లే..

ఒకవేళ చేస్తున్న ప్రచారం అబద్ధం అని తెల్సేలోపు చేసే అప్పటికే జనాల్లోకెళ్లిన అసత్య ప్రచారం వల్ల జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కేటీఆర్ టార్గెట్ అయితే కేటీఆర్ పై రాజకీయ విమర్శలు చేయాలి.. కేసీఆర్ అయితే కేసీఆర్ పై చేయాలి. కానీ ఇలా ఫ్యామిలీని రాజకీయాల కోసం లాగడం కరెక్టు కాదు..ఇది ఇలాగే జరిగితే సామాన్యులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు అని దయలేని ప్రభుత్వం.. దిక్కులేని ప్రజలు అని సందేశం ఇస్తున్నారా.. ఇప్పాటికైన రాజకీయ విమర్శలు చేయాలి కానీ ఇలాంటి చర్యలు ఏ పార్టీకి మంచిది కాదు.. రాష్ట్రానికి మంచిది కాదని వారు హెచ్చరిస్తున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *