తెలంగాణ దశాబ్ధి వేడుకలకి ముందు సోనియా గాంధీ షాకింగ్ డిసెషన్
జూన్ 2తో తెలంగాణ ఏర్పడి పదేండ్లు పూర్తి చేసుకుంటున్న సంగతి తెల్సిందే. పదేండ్లను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ దశాబ్ధి ముగింపు వేడుకల పేరిట ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులు,అమరవీరుల కుటుంబాలతో పాటు అన్ని వర్గాల నేతలను ఆహ్వానించింది.
ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీకి కూడా కాంగ్రెస్ సర్కారు అహ్వానం పంపారు
అయితే తాజా సమాచారం మేరకు సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. తీవ్ర అనారోగ్య కారణాలతో సోనియా గాంధీ దశాబ్ది వేడుకలకు హాజరు కాలేకపోతున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.