పదేండ్లలో తొలిసారిగా హైదరాబాద్ లో ..?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు పదేండ్ల తర్వాత రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు పోలీస్ అధికారులు ప్రకటించారు.ఏక్ పోలీస్ విధానం అమలు కోసం కుటుంబ సభ్యులతో కలిసి బెటాలియన్ కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళనలు ఉదృతమైన సంగతి తెల్సిందే. యూనిఫాంలతో వచ్చి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
దీంతో బెటాలియన్ కానిస్టేబుళ్లకు భయభ్రాంతులు కలిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి చర్యలకు ఉపక్రమించింది. ఆర్టికల్ 311 ప్రకారం ఆదివారం మరో పది మంది కానిస్టేబుళ్లను విధుల నుండి పూర్తిగా తొలగిస్తున్నట్లు ఉత్తర్వులను జారీ చేసింది.
దీంతో పాటు నగరంలో నెల రోజుల పాటు అంక్షలు విధించింది. న్యాయ సురక్ష సంహిత 2023 సెక్షన్ 163 అమలు చేయనున్నట్లు నగర కమీషనర్ తెలిపారు. నిన్న ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుండి నవంబర్ 28 తారీఖు సాయంత్రం ఆరు గంటల వరకు ఈ అంక్షలు వర్తిస్తాయని తెలిపారు. దీని ప్రకారం ఐదారుగురు కంటే ఎక్కువగా గుమికూడదు.. నిరసనలు.. ర్యాలీలు చేపట్టకూడదు అని ఆదేశించారు.