మెగా అభిమానులకు శుభవార్త

 మెగా అభిమానులకు శుభవార్త

Ram Charan Tej

Loading

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ చేంజర్.కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా తీస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి టీజర్ అప్ డేట్ గురించి చిత్రం మేకర్స్ రీవూల్ చేశారు.

ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి పాటలను విడుదల చేసి ప్రేక్షకుల్లో.. అభిమానుల్లో మంచి జోష్ నింపారు. ఈ చిత్రం టీజర్ ను అతి త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. రామ్ చరణ్ తేజ్ గురించి అదిరిపోయే లుక్ ఒకటిని విడుదల చేశారు.

ఈ లుక్ లో రామ్ చరణ్ తేజ్ కలెక్టర లా కన్పిస్తున్నారు. అలాగే తనకు ఎదురుగా చాలా మంది పరుగెత్తుకోని రావడం దర్శనమిచ్చింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఎస్జే సూర్య, శ్రీకాంత్ ,సునీల్ ,రవిబాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.. దిల్ రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీ వచ్చేడాది జనవరి పదో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *