పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చీరలు.. గాజులు
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాద స్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిన ప్రతులతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కెపీ వివేకానంద్ గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి వినతి పత్రం అందచేశారు.
అనంతరం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ” బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహారి, అరికెలపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్,పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, డా. సంజయ్ కుమార్, తెల్లం వెంకట్రావు తదితరులు దమ్ముంటే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలవాలని ఆయన సవాల్ విసిరారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుంది. పది చోట్ల ఉప ఎన్నికలు రావడం .. బీఆర్ఎస్ గెలవడం తథ్యం .. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఇజ్జత్ లేదు.. దమ్ము లేదు.. మగాళ్ళే కాదు కాబట్టి వారందరికీ చీరలు,గాజులు పంపుతున్నాను.. ఇవి ధరించండి అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నిజంగా వాళ్లు మగాళ్లైతే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.