సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఒకటే డైట్..!
తెలంగాణ వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులందరికీ ఒక విధమైన ఆహారం అందించాలన్న సంకల్పంలో చేపట్టిన కామన్ డైట్ మెనూ నేటి నుంచి ప్రారంభమైంది.
చేవెళ్ల నియోజకవర్గం చిలుకూరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కామన్ డైట్‌ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.రాష్ట్ర వ్యాప్తంగా కామన్ మెనూ డైట్ కార్యక్రమం జరగ్గా, చిలుకూరులో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి అక్కడ పలువురు విద్యార్థులతో ముచ్చటించారు.
ఈ స్కూల్ నుంచి ప్రతిభ కనబరిచి ఐఐటీ లాంటి ఉన్నత విద్యా సంస్థల్లో చేరిన పలువురు విద్యార్థులకు ల్యాప్ టాప్ లు బహూకరించారు. అనంతరం పిల్లలు, వారి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు. భోజనం చేస్తున్న సందర్భంగా విద్యార్థుల నుంచి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.