వైసీపీ మాజీ మంత్రి ఇండ్లపై రాళ్ల దాడి.

 వైసీపీ మాజీ మంత్రి ఇండ్లపై రాళ్ల దాడి.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీడీపీ కూటమి నూట అరవై నాలుగు స్థానాల్లో విజయదుందుభితో ముఖ్యమంత్రిగా టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు కూడా..

అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుండే వైసీపీకి చెందిన నేతలు..కార్యకర్తలు..మాజీ ఎమ్మెల్యేలు..మంత్రులను సైతం వదలకుండా దాడులకు దిగుతున్నారు కూటమి శ్రేణులు.. తాజాగా వైసీపీ నేత..మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపై  గుర్తు తెలియని యువకులు రాళ్ల దాడి చేశారు.


మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటి దగ్గర రక్షణగా ఉన్న
భద్రతా సిబ్బంది బయటికి రావడంతో ఆ యువకులు అక్కడ నుండి పరారయ్యారు. అయితే సదరు యువకులు ఓ కారులో వచ్చి  రాళ్లదాడి చేశారని భద్రతా సిబ్బంది తెలిపారు.. ఈ దాడి గురించి స్థానిక
పోలీసులకు మాజీ మంత్రి జోగి రమేష్‌ సిబ్బంది ఫిర్యాదు చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *